నేడు సిరిసిల్లలో వెంకటేశ్వర స్వామి రథోత్సవం

రాజన్నసిరిసిల్ల, 28 అక్టోబర్(జనవిజన్ న్యూస్): సిరిసిల్ల పట్టణములోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు గత తొమ్మిది రోజులుగా అంగరంగ వైభవముగా జరుగుతున్నాయి. నేడు ఆశ్వయుజ పౌర్ణమి సందర్భముగా రథోత్సవం మీద శ్రీవారిని దర్శించుకొని తమ మ్రొక్కులు తీర్చుకునేందుకు భక్తులు బారులు దీరారు. రాత్రి రెండు గంటల నుండే రథబలి, వివిధ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న తర్వాత శ్రీవారిని రథముపై ఆసీనులను కావించారు. అనంతరం వేదపండితులు శ్రీ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు శ్రీవారిని దర్శించుకునేందుకు అనుమతించారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో అతి పెద్దదైన ఈ రథోత్సవమును తిలకించేందుకు వివిధ  రాష్ట్రాల నుండి భక్తులు తరలివస్తారు.

Post a Comment

Previous Post Next Post