హైదరాబాద్‎లో మరోసారి ఇండియన్ రేసింగ్ లీగ్

హైదరాబాద్:వచ్చే నెలలో జరగనున్న ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ పోటీలకు నగరం మరోసారి ఆతిథ్యమివ్వనుంది. ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ అనంతరం వచ్చే ఫిబ్రవరిలో ఫార్ములా- ఈ పోటీలు జరగనున్నాయి..

ఈ క్రమంలో నవంబర్‌ 4, 5 తేదీల్లో నిర్వహించనున్న ఇండియన్‌ మోటార్‌ రేసింగ్‌ లీగ్‌ కోసం హెచ్‌ఎండీఏ ఏర్పాట్లు చేపట్టింది. నెక్లెస్‌రోడ్డులోని స్ట్రీట్‌ సర్క్యూట్‌ పునరుద్ధరణకు అధికారులు చర్యలు ప్రారంభించారు.

గతంలో కార్‌ రేసింగ్‌ పోటీల సందర్భంగా ఏర్పాటు చేసిన రోడ్డు డివైడర్లు, బారికేడ్లు, ఎత్తైన కంచెలను తిరిగి ఏర్పాటు చేస్తున్నారు. మరో నాలుగైదు రోజుల్లో అన్ని పనులను పూర్తి చేసి నవంబర్‌ నాటికి రేసింగ్‌ నిర్వహణకు సిద్ధం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇదే ట్రాక్‌పై ఫిబ్రవరి 10న ఫార్ములా-ఈ పోటీలు జరుగుతాయి. గతేడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి ఎలాంటి లోపాలకు తావు లేకుండా ట్రాక్‌ పునరుద్ధరణ చేపట్టారు.

Post a Comment

Previous Post Next Post