నేడు, రేపు కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలు రద్దు

సికింద్రాబాద్, అక్టోబర్ 10 (జనవిజన్ న్యూస్):
తిరుపతి ఆదిలాబాద్ మధ్య కాజీపేట మీదుగా నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ ఈనెల 10, 11 తేదీలలో రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్‌ డివిజన్‌ పరిధిలో జరిగే ఇంటర్‌లాకింగ్‌ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే టికెట్లు రిజర్వేషన్‌ చేసుకున్న వారికి తిరిగి నగదు చెల్లిస్తామని వివరించారు. గడిచిన రెండు వారాల్లో కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేయడం ఇది రెండోసారి. ఈనెల 15 వరకు ప్యాసింజర్లు..కాజీపేట- డోర్నకల్‌ మధ్య నడిచే డోర్నకల్‌ ప్యాసింజరు, సికింద్రాబాద్‌-వరంగల్‌ మధ్య నడిచే పుష్‌పుల్‌, కాజీపేట -బల్లార్షా మధ్య నడిచే ప్యాసింజర్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల రద్దును ఈనెల 15 వరకు పొడిగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Post a Comment

Previous Post Next Post