Posted by Chief Editor Dayanand Jana
హైదరాబాద్,12 అక్టోబర్(జనవిజన్ న్యూస్): విజయదశమి రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన క్యాంప్ ఆఫీస్‌ను విశాఖకు షిఫ్ట్ చేస్తున్నారు. ఈ నెల 24న ఆయన అధికారికంగా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే, ఈ నేపథ్యంలోనే ఈ నెల 16వ తేదీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ పర్యటన అంతటా ఆసక్తికరంగా మారింది. అయితే ఆరోజు ముఖ్యమంత్రి రిషికొండ ఐటి హిల్స్‌లో నూతనంగా ఏర్పాటైన ఇన్ఫోసిస్ క్యాంపస్‌ను సందర్శించనున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీంతో ఆ రోజు నుంచి విశాఖలో ఇన్ఫోసిస్ తన కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభించనుంది.
Tags
Amaravathi