ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు.. ఎంపీ దాడి ఘటనపై గవర్నర్‌ తమిళిసై

ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు.. ఎంపీ దాడి ఘటనపై గవర్నర్‌ తమిళిసై

హైదరాబాద్: సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌ మండలం సూరంపల్లిలో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై జరిగిన కత్తి దాడి ఘటనపై గవర్నర్‌ తమిళిసై స్పందించారు..

ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభాకర్ రెడ్డి త్వరగా కొలుకోవాలన్నారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. ''ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్య ప్రక్రియకే ప్రమాదకరం. ఎన్నికల సమయంలో పోటీలో ఉన్న అభ్యర్థులు, ప్రచారం చేసే సమయంలో వారి భద్రత కోసం తగిన చర్యలు తీసుకోవాలి. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల కోసం శాంతియుత వాతావరణాన్ని ఉండేలా చూడటం చాలా అవసరం'' అని గవర్నర్‌ పేర్కొన్నారు..

Post a Comment

Previous Post Next Post