కరీంనగర్ జిల్లా పోలీస్ కమిషనర్ గా అభిషేక్ మహంతిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి ఇవ్వాల సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు
2011 బ్యాచ్ కు చెందిన ఐపిఎస్ అధికారి మహంతి ఆంధ్ర ప్రదేశ్ లో పనిచేసి గత కొన్ని నెలల క్రితం తెలంగాణకు అలాటయ్యారు.
కడప జిల్లా ఎస్పీగా పని చేస్తారు. ప్రస్తుతం ఆయన రాచకొండ ట్రాఫిక్ డిసిపిగా విధులు నిర్వహిస్తున్నారు.
దీనిలో భాగంగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా 2015 బ్యాచ్ కు చెందిన పమేలా సత్పతిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం ఆమె మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు....