సిరిసిల్ల అర్బన్, 9 అక్టోబర్ (జనవిజన్ న్యూస్): సిరిసిల్ల అర్బన్ పరిధిలోని మునిసిపల్ విలీన గ్రామం చిన్న బోనాలలో వడ్ల కొనుగోలు కేంద్రానికి స్థలం కేటాయించాలంటూ 10వ వార్డ్ కౌన్సిలర్ బొల్గం నాగరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రజావాణిలో అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ కు వినతి పత్రం అందించారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి కేంద్రం నిర్వాహకులు స్థానిక కౌన్సిలర్మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వడ్ల కొనుగోలు కేంద్రానికి స్థలాన్ని కేటాయించకపోవడంతో బైపాస్ రోడ్డును ఆనుకొని కొనుగోలు కేంద్రాన్ని నిర్వహించారు. బైపాస్ రోడ్డు ప్రారంభానికి సిద్ధం చేయడంతో వడ్ల కొనుగోలుకు ఇబ్బందిగా మారుతుందని వినతిపత్రంలో పేర్కొన్నారు. చిన్న బోనాలలో ఉన్న నల్లెల గుట్ట ప్రాంతంలోని సర్వే నంబర్ 164 లో 10 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని వినతి పత్రం ద్వారా కోరారు.
వడ్ల కొనుగోలు కేంద్రానికి స్థలం కేటాయించాలంటూ అదనపు కలెక్టర్ కు వినతి
byJanavisiontv
-
0