వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని మూసివేసిన దేవాదాయ శాఖ అధికారులు

రాజన్నసిరిసిల్ల జిల్ల, అక్టోబర్ 28:
దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని చంద్రగ్రహణం సందర్భంగా శనివారం సాయంత్రం మూసివేశారు.

ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమశంకర్ ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గర్భగుడి ద్వారాన్ని, ఆలయ ప్రధాన ముఖద్వారాన్ని అధికారుల సమక్షంలో మూసేశారు.

ఆదివారం ఉదయం ఆలయ సంప్రోక్షణ, ప్రాతఃకాల పూజల తర్వాత ఆరు గంటల నుండి భక్తులకు స్వామి వారి దర్శనం ఉంటుందని ఆలయ అధికారులు వెల్లడించారు.

అలంపూర్‌లో ఆలయాల మూసివేత
జోగులాంబ- గద్వాల జిల్లా అలంపూర్‌లోని శ్రీ జోగులాంబ, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను చంద్రగ్రహణం సందర్భంగా శనివారం సాయంత్రం ఐదు గంటలకు మూసివేశారు.

ఆదివారం ఉదయం 5:30 గంటలకు ఆలయ శుద్ధి, మహాసంప్రోక్షణ చేసిన తర్వాతఉదయం 9 గంటలకు మహా మంగళ హారతితో భక్తులకు అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు.

Post a Comment

Previous Post Next Post