Posted by Chief Editor Dayanand Jana
అధికారులు నిస్పక్షపాతంగా ఉండాలి.. క్వాలిటీ రెస్పాన్స్ చాలా ముఖ్యం..
సిరిసిల్ల 09, అక్టోబర్ 2023: ఎన్నికల ఫిర్యాదుల పై తక్షణ మే స్పందించాలనీ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి అన్నారు. ఫిర్యాదుల పై క్వాలిటీ రెస్పాన్స్ చాలా ముఖ్యమన్నారు. సోమవారం కలెక్టరేట్ మినీ మీటింగ్ హల్ నందు సమీకృత కంట్రోల్ రూమ్ బాధ్యులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. సి - విజిల్ వచ్చే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనలపై 100 నిమిషాల్లో తీసుకున్న చర్యలపై నివేదికను అప్ లోడ్ చేయాలన్నారు. రాజకీయ పార్టీలు ప్రచార కార్యక్రమాల అనుమతుల కోసం సువిధలో చేసుకున్న దరఖాస్తులను టైం లోగా ప్రాసెస్ అయ్యేలా చూడాలన్నారు. ఫేక్ న్యూస్ ల వల్ల వ్యవస్థ పై నమ్మకం పోయే అవకాశం ఉన్న దృష్ట్యా అలాంటి వాటిని డిటెక్ట్ చేసి వెంటనే ఖండన వార్తలను ప్రచురించేలా చూడాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్, డిప్యూటీ జిల్లా ఎన్నికల అధికారి ఎన్ ఖీమ్యా నాయక్, CPO పిబి శ్రీనివాస చారి, జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథం, లేబర్ అధికారి రఫీ, ఎస్సీ కార్పొరేషన్ ED వినోద్ తదితరులు పాల్గొన్నారు . అంతకుముందు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన వెంటనే... జిల్లాలోనీ ఎన్నికల నోడల్ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల మార్గదర్శకాల ను వివరించి ఉల్లంఘనలపై వెంటనే స్పందించి తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.