కొండగట్టు హనుమాన్ సన్నిధి నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రచారం

Input Editor Dayanand Jana
జగిత్యాల జిల్ల, 13 అక్టోబర్ (జనవిజన్ న్యూస్):
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నిక ప్రచారానికి సర్వం సిద్ధం చేసుకుంది. ఏఐసీసీ అగ్ర నేతలు హాజరు కానున్న ఈ ప్రచార కార్యక్రమం జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజల అనంతరం ప్రారంభం కానుంది.

ఈ నెల 18న అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు రానున్నారు. వీరు రాక ముందే కాంగ్రెస్ అబ్యర్తుల జాబితా ప్రకటించనుంది. మూడు నియోజక వరహాల పరిధి లో యాత్ర ఉండనుంది.రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం బస్సు యాత్ర ప్రారంబింస్తారు

ఇందులో భాగంగా ఈ నెల 18న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల క్యాంపెయిన్ ప్రారంభించేందుకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేపట్టింది ఏఐసీసీ కార్యదర్శి సుశాంక్ మిశ్రా శుక్రవారం కొండగట్ట అంజన్న క్షేత్రాన్ని సందర్శించారు. అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల పర్యటనకు సంబంధించిన రూట్ ను పర్యవేక్షించారు.


సుశాంక్ తో పాటు ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి, ధర్మపురి, చొప్పదండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మేడిపల్లి సత్యంలు కూడా ఉన్నారఈ నెల 18న కొండగట్టు అంజన్న క్షేత్రానికి రానున్న రాహుల్, ప్రియాంక గాంధీలు ఆలయంలో ప్రత్యేక పూజల నిర్వహించి ప్రచారం ప్రారంభిస్తారు.,

Post a Comment

Previous Post Next Post