Input Editor Dayanand Jana
హైదరాబాద్,13 అక్టోబర్(జనవిజన్ న్యూస్): నేటి నుంచే పూల సంబురం.. ఎంగిలి పూల బతుకమ్మతో పండుగ ప్రారంభం..
తెలంగాణ ప్రజలకు బతుకమ్మ పండుగ ఎంతో ప్రత్యేకమైనది. పల్లె పట్నం అని తేడా లేకుండా.. రాష్ట్రమంతటా తొమ్మిది రోజులపాటు అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలను జరుపుకుంటారు..
నేటి నుంచి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం అవుతున్నాయి. తొలిరోజు ఎంగిలి పూల బతుకమ్మతో మొదలయ్యే పండుగ.. చివరి రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. దేవునికి పూలను పెట్టి పూజిస్తాం. కానీ పూలనే పూజించే విశిష్ఠమైన సంప్రదాయం బతుకమ్మ. తంగేడు, గునుగు, కట్ల, గుమ్మడి మొదలైన పూలతో.. బతుకమ్మలను అందంగా తయారు చేయడం ఈ పండుగ ప్రత్యేకత.
Tags
తెలంగాణ