ఏపీ సెక్రటేరియట్,13 అక్టోబర్(జనవిజన్ న్యూస్): ఏపీలో ఎన్నికల (AP Elections) ప్రక్రియలో భాగస్వాములై ఉన్న అధికారులు, ఉద్యోగుల బదిలీలను నిషేధిస్తూ (AP CEO) రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా కీలక ఉత్తర్వులు జారీ చేశారు.
2024 ఓటర్ల తుది జాబితా రూపొందే వరకూ నియామకాలు, బదిలీలపై ఎన్నికల ప్రధానాధికారి అనుమతి తీసుకోవాలని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఓటర్ల తుది జాబితా రూపకల్పనలో భాగస్వాములైన సిబ్బంది ఖాళీలు పైనా అక్టోబర్ 10వ తేదీలోగా వివరాలు ఇవ్వాలని ఆదేశించారు.
ఈ వివరాలను ఇవ్వాలని జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లు, ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులు, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లకు స్పష్టమైన ఆదేశారు ఇచ్చారు.
ముందస్తు అనుమతి లేకుండా ఎన్నికల ప్రక్రియలోని అధికారులు, ఉద్యోగుల బదిలీకి వీల్లేదని స్పష్టం చేశారు. ఫోటో ఓటర్ల తుది జాబితా రూపకల్పన కోసం అన్ని ఖాళీలను అక్టోబర్ 10 లోగా భర్తీ చేయాలని సూచించారు. 2023 అక్టోబర్ 27 నాటికి ముసాయిదా జాబితా, అలాగే 2024 జనవరి 5 తేదీ నాటికి ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు.
Tags
ఆంధ్రప్రదేశ్