డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆదేశాలతో 2 కోట్లు విలువగల గంజాయి ద్వoసం

Input Editor Dayanand Jana
ములుగు జిల్ల,13 అక్టోబర్(జనవిజన్ న్యూస్): రోజు రోజుకు పెరిగి పోతున్న గంజాయి విక్రయానికి అడ్డుకట్ట వేసే దిశగా ములుగు జిల్ల ఎస్పీ గౌష్ ఆలం ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. డ్రగ్ డీస్-పోసల్ కమిటీ ఆదేశాల ప్రకారం ములుగు, పస్రా, ఏటూర్ నాగారం, మంగపేట, వెంకటాపురం పరిధిలో సీజ్ చేసిన 757 కిలోల 625 గ్రాముల గంజాయిని గురువారం జిల్లా ఎస్పీ గాష్ ఆలం, ఓఎస్డి అశోక్ కుమార్, ఏ ఎస్ పి ఏటూరునాగారం సిరిశెట్టి సంకీర్త్ ఆధ్వర్యంలో తగు జాగ్రత్తలు పాటిస్తూ ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ..  కొందరు అక్రమార్జనలో భాగంగా గంజాయిని విక్రాయిస్తూ పట్టనాలతో పాటు గ్రామాలలోని యువతను ప్రలోభాలకు గురి చేస్తూ గంజాయి మత్తులోకి దించుతున్నందున వారిని అరికట్టడం కోసం జిల్లాలోని పోలీస్ అధికారులచే ఒక రహస్య బృందాన్ని ఏర్పాటు చేసినట్టుగా పేర్కొన్నారు. ఎవరైనా గంజాయి గానీ ఇతర మత్తు పదార్థాలు గానీ విక్రయిస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. తమ పరిసరాలలో గంజాయిని విక్రయిస్తున్నట్టు అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీస్ లకు సమాచారం అందించి వారి పిల్లల బంగారు భవిష్యత్తు కాపాడు కోవాల్సిందిగా ఎస్ పి కోరారు. ఈ కార్యక్రమంలో డ్రగ్ డీస్ పోసల్ కమిటీ సభ్యులు (4సభ్యులు )ఎస్ పి గౌష్ ఆలం, ఓ ఎస్ డి అశోక్ కుమార్, ఏ ఎస్ పి ఏటూరునాగారం సిరిశెట్టి సంకీర్త్, సి సి ఎస్, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ దయాకర్ లు, రిజర్వుడ్ ఇన్స్పెక్టర్ అడ్మిన్ సతీష్, ఆర్ ఐ వెంకటనారాయణ ఎస్ ఐ కమలాకర్ పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post