ఏప్రిల్ 1 నుంచి మన ఇసుక వాహనంతో సరఫరా
ఇసుక కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఇబ్బందులు రావద్దు
ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం
కలెక్టర్ గరిమ అగ్రవాల్
ఎస్పీ మహేష్ బి గితే, వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్లు, ఎస్ హెచ్ ఓలతో కలిసి ఐడీఓసీలో జిల్లా స్థాయి సాండ్ కమిటీ సమావేశం
---------------------------------
రాజన్న సిరిసిల్ల, మార్చి -26
----------------------------------
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వచ్చే నెల (ఏప్రిల్) ఒకటో తేదీ నుంచి మన ఇసుక వాహనం ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకున్న వారికి ఇసుక సరఫరా అవుతుందని కలెక్టర్ గరిమ అగ్రవాల్ వెల్లడించారు.
మన ఇసుక వాహనం ఆన్లైన్ విధానం
ఇసుక సరఫరా తదితర అంశాలపై జిల్లా స్థాయి సాండ్ కమిటీ సమావేశాన్ని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో గురువారం నిర్వహించగా, కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తో కలిసి నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వచ్చేనెల ఒకటో తేదీ నుంచి మన ఇసుక వాహనం ఆన్లైన్ విధానం ద్వారా ఇసుక సరఫరా చేయనున్నట్లు తెలిపారు. జిల్లా కమిటీ ఆమోదించిన ఇసుక రీచ్ ల నుంచే ఇసుక తరలించాలని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఇసుక ఇబ్బందులు రావద్దని స్పష్టం చేశారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మండల, డివిజన్, జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ టీంలు ఏర్పాటు చేయాలని, ఆయా ఇసుక రీచ్లను రెవెన్యూ, పోలీస్ అధికారులు తనిఖీ చేయాలని సూచించారు. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలోని ఇటుక ఇటుక బట్టీలు నిబంధనలకు అనుగుణంగా అనుమతులు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
నిర్ణీత సమయంలోనే ఇసుక సరఫరా చేయాలని ఎస్పీ మహేష్ బి గితే సూచించారు. ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిరంతరం నిఘా పెడతామని స్పష్టం చేశారు.
సమావేశంలో జిల్లా మైనింగ్ అధికారి క్రాంతి కుమార్, డీఎస్పీ నాగేంద్రచారి, జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ కుమార్, కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రవీణ్, నీటి పారుదల, భూగర్భ జల, అధికారులు, తహసీల్దార్లు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.