సోమవారం నుంచి ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తాం: జిల్లా రవాణా శాఖ ఇన్చార్జి అధికారి

వాహనాల ట్యాక్స్ చెల్లించాలి

సోమవారం నుంచి ప్రత్యేక తనిఖీలు చేస్తాం

జిల్లా ఇంచార్జి రవాణా శాఖ అధికారి వంశీదర్

జిల్లాలో సరుకు, ప్రయాణికులను చేరవేసే వాహనాలకు సంబంధించిన 4,419 గల వాహనాల యజమానులు పన్ను చెల్లించాలని జిల్లా ఇంచార్జి రవాణా శాఖ అధికారి వంశీదర్ ఒక ప్రకటనలో సూచించారు. ఆయా వాహనాలు రోడ్డు టాక్స్ కట్టకుండా వినియోగిస్తున్నారని తెలిపారు  సిరిసిల్ల డివిజన్ కు సంబంధించి 2,787 వాహనాలు, వేములవాడ డివిజన్ కి సంబందించి 1,632 వాహనాలు ఉన్నాయని వెల్లడించారు. అలాగే ఫిట్ నెస్ సర్టిఫికెట్ లేకుండా జిల్లాలో 11,425 వాహనాలు తిరుగుతున్నాయని తెలిపారు. సిరిసిల్ల రెవెన్యూ దివిజన్ లో 6,647, వేములవాడ డివిజన్ లో 4778 ఉన్నట్టు రికార్డ్ లో ఉందని పేర్కొన్నారు.  


ట్యాక్స్, ఫిట్ నెస్ సర్టిఫికెట్ లేని వాహనాల యజమానులు ట్యాక్స్ చెల్లించి ఫిట్ నెస్ చేయించుకోవాలని సూచించారు. ఈ నెల 6 వ తేదీ సోమవారం నుంచి ప్రత్యేక తనిఖీలు నిర్వహించి కేసులు బుక్ చేసి సీజ్ చేస్తామని స్పష్టం చేశారు.

Post a Comment

Previous Post Next Post