లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిది చెక్కుల పంపిణీ
సిరిసిల్ల 3 అక్టోబర్ 2025:
పలు అనారోగ్య సమస్యలతో ఆసుపత్రుల్లో శస్త్ర చికిత్సలు చేయించుకుని ప్రభుత్వ సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. శుక్రవారం సిరిసిల్ల అర్బన్ పరిధి పెద్దూరు 8వ వార్డులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెన్నమనేని కమలాకర్ రావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయనిది చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. చిన్న బోనాలకు సలేంద్రి దేవయ్య రూ. 53,000, తిప్పవరం లక్ష్మీనారాయణ రూ. 40,000, రాకం నరసయ్య రూ. 60,000, రెడ్డిమల్ల లక్ష్మి రూ. 28,000, బడుగు శ్రీనివాస్ రూ. 9,000 విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందజేయడానికి కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెన్నమనేని కమలాకర్ రావు, సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి లతో పాటు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పెద్దూర్ మాజీ సర్పంచ్ రాకం రమేష్, స్థానికులు రెడ్డిమల్ల దేవయ్య, పల్క చంద్రయ్య, రెడ్డిమల్ల దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.