రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంత్రి సీతక్క పర్యటన

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంత్రి సీతక్క పర్యటన 
సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా నేత కార్మికులు నేసిన చీరలను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కేకే మహేందర్ రెడ్డి తో కలసి మంత్రి సీతక్క పరిశీలించారు. చీరలు నేసే విధానం దగ్గరుండి పరిశీలించి కార్మికుల నుండి వివరాలు అడిగి మంత్రి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళా సంఘాల సభ్యులకు త్వరలోనే పంపిణీ చేస్తా మని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వర్ ఆదేశాలతో నేతన్నలకు 64 లక్షల చీరలు ఆర్డర్ చేయడం జరిగిందని చెప్పారు. ఈ రోజు నేతన్నలు పడుతున్న సుఖసంతోషాలను స్వయంగా చూడటం జరిగిందని తెలిపారు. రానున్న రోజుల్లో నేతన్నలకు మరిన్ని ఆర్డర్లు ఇస్తామని అన్నారు. నేతన్నలకు ఉపయోగపడే యరన్ డిపో 50 కోట్లతో వేములవాడలో ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. గత ప్రభుత్వం పెట్టిన నేతన్న బకాయిలు ప్రజా ప్రభుత్వంలో తీర్చడం జరిగిందని తెలిపారు. కోటి మంది మహిళను కోటీశ్వరులను చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పించారని అందులో భాగంగానే మహిళలకు పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్, ఆర్టీసీ బస్సులు, బస్సులో ఉచిత ప్రయాణం వంటి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. వారికి ఆదాయాన్ని సమకూర్చడం కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. మహిళా సంఘాల బలోపేతనికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. మహిళా సంఘాల సభ్యులకు ఏక రూప దుస్తులను పంపిణీ చేస్తామని, నేతన్నల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. వారికి నిరంతరం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని, మహిళా సంఘాల సభ్యులకు వడ్డీలేని రుణాలు, ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నామని స్పష్టం చేశారు.

Post a Comment

Previous Post Next Post