సెప్టెంబర్ 10న స్థానిక సంస్థల తుది ఓటర్ జాబితా ప్రచురణ: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

సెప్టెంబర్ 10న స్థానిక సంస్థల తుది ఓటర్ జాబితా ప్రచురణ: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ
స్థానిక సంస్థల ఓటర్, పోలింగ్ కేంద్రాల జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్

-------------------------------
రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్-08:
-------------------------------

 సెప్టెంబర్ 10న స్థానిక సంస్థల తుది ఓటర్ జాబితా ప్రచురణ జరుగుతుందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ తెలిపారు.

సోమవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల ఓటర్, పోలింగ్ కేంద్రాల జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ.. స్థానిక సంస్థలైన ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల నిర్వహణకు డ్రాఫ్ట్ ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాల వివరాలను విడుదల చేయడం జరిగిందని అన్నారు. 650 ఓటర్లకు ఒక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. 

సిరిసిల్ల జిల్లాలో 123 ఎంపిటిసి ,12 జడ్పిటిసి స్థానాలకు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్నాయని, వీటి పరిధిలో 3,53,351 ఓటర్లు ఉన్నారని, 278 లొకేషన్స్ లో 712 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ఒక మేజర్ గ్రామ పంచాయతీ 2 ఎంపీటీసీ స్థానాల పరిధిలో ఉంటే ఒక కుటుంబంలోని సభ్యులందరూ ఒకే ఎంపీటీసీ స్థానంలో ఓటర్లుగా ఉండేలా చర్యలు చేపట్టామని అన్నారు. డ్రాఫ్ట్ ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాలపై ఎటువంటి అభ్యంతరాలు ఉన్న సెప్టెంబర్ 8 సాయంత్రం లోపు అందించాలని, సెప్టెంబర్ 9న అభ్యంతరాలను పరిష్కరించి సెప్టెంబర్ 10న తుది ఓటర్ జాబితా ప్రచురించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.   

ఈ సమావేశంలో జడ్పీ సీఈవో వినోద్ కుమార్, సంబంధిత అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, తదితరులు పాల్గోన్నారు.

Post a Comment

Previous Post Next Post