వినాయక నిమజ్జనాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
-------------------------------
సిరిసిల్ల, సెప్టెంబర్ - 07
-------------------------------
గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సిరిసిల్లలో ఆదివారం వినాయక నిమజ్జన వేడుకలు సిరిసిల్ల మానేరు తీరంలోని బ్రిడ్జి వద్ద, ప్రేమ్ నగర్ లో కొనసాగాయి. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితేతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ బోటులో మానేరు నదిలో నిమజ్జన ప్రక్రియను పరిశీలించారు.
జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా సాగిన వినాయక విగ్రహాల నిమజ్జనం
ఎలాంటి అవాంచనీయ సంఘటనలు లేకుండా నిమజ్జన ప్రక్రియ పూర్తి
శోభాయాత్రలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో నిఘా
క్షేత్ర స్థాయిలో కష్టపడి విధులు నిర్వర్తించిన సిబ్బందిని, అధికారులను అభినందించిన ఎస్పీ
జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటుగా మండల కేంద్రాల్లో నిర్వహించిన వినాయక విగ్రహాల నిమజ్జన ప్రక్రియ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా, సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలగకుండా ప్రశాంతంగా పూర్తి.
జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం జరిగేలా కృషి చేసిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. నిమజ్జనం విజయవంతంగా, ప్రశాంతంగా పూర్తయ్యేందుకు సహకరించిన జిల్లా ప్రజలకు, మండపాల నిర్వాహకులకు ఎస్పీ ఈసందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూపారెడ్డి పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.