మెదక్ జిల్లా తో పాటు కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎగువ మానేరు జలాశయం అధిక ప్రవాహంతో పొంగిపొర్లుతోంది. ఎగువ మానేరు జలాశయానికి ఎగువన పాల్వంచ వాగు ఉదృతంగా ప్రవహిస్తూ మానేరులో కి వరద ప్రవాహాన్ని పెంచింది. పాల్వంచ వాగుపై నిర్మించిన బ్రిడ్జి పైనుంచి వరద పోటెత్తడంతో సిరిసిల్ల - కామారెడ్డి రహదారిపై రాకపోకలు స్తంభించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పలువురు పశువుల కాపరులు వరద ప్రవాహంలో చిక్కుకోగా అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. రెండు టీఎంసీల సామర్థ్యం గల ఎగువ మానేరు జలాశయం నేటి రాత్రి 9 గంటల వరకు ఎగువ మానేరు జలాశయం వద్ద వరద ప్రవాహ ఉదృతి ఇన్ ఫ్లో 85,446 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో కూడా 85,446 క్యూసెక్కులు గా నమోదయినట్లు అధికారులు వెల్లడించారు. ఎగువ మానేరు నుంచి మద్యమానేరుకు మానేరు వాగు ద్వారా వరద ఉధృతంగా ప్రవహిస్తూ 73,880 క్యూసెక్కుల ఇన్ ఫ్లో గా నమోదయినట్లు అధికారులు తెలిపారు. ఈ వరద ఎస్సారెస్పీ తో పాటు మూలవాగు, మానేరు వాగు ద్వారా ప్రవహిస్తున్నట్లు అధికారులు చెప్పారు. మద్యమానేరు జలాశయం సామర్థ్యం 27 టీఎంసీలు కాగా ఇప్పటివరకు 18 టిఎంసిల నీటి నిల్వ ఉన్నది. 19,715 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. భారీ వర్షాలు వరదల కారణంగా అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుంచి ఎవరు బయటకు రాకూడదని జిల్లా కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
నేటి రాత్రి వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జలాశయాల నీటిమట్టం
byJanavisiontv
-
0