మహిళలు ఆర్థికంగా ఎదిగి ఆత్మగౌరవంతో జీవించాలి: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
శ్రీ షిర్డీ సాయిబాబా గ్రామ సమాఖ్య మహిళా సంఘం ద్వారా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ను ప్రారంభించిన ప్రభుత్వ విప్
గంభీరావుపేట, 31 జూలై 2025:
మహిళలు ఆర్థికంగా ఎదిగి ఆత్మగౌరవంతో జీవించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. గురువారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, కేకే మహేందర్ రెడ్డి లతో కలిసి గంభీర్ రావు పేట మండలం లింగన్న పేట గ్రామంలో శ్రీ షిర్డీ సాయిబాబా గ్రామ సమాఖ్య మహిళా సంఘం ద్వారా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళా సంఘాల ద్వారా నడిపే 3వ పెట్రోల్ బంక్ ప్రారంభించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. పేదల సంక్షేమం ఎజెండాగా ఇందిరమ్మ పాలన రాష్ట్రంలో కొనసాగుతుందని అన్నారు. ఇండియా అంటే ఇందిరా, ఇందిరా అంటే ఇండియా ప్రపంచం కొనియాడేలా ఇందిరమ్మ పాలన చేసిందని అన్నారు.
బ్యాంకుల జాతీయకరణం, గరిబీ హఠావో నినాధంతో ప్రత్యేక కార్యక్రమాలు, కూడు, గుడు, qqగుడ్డ అమలు, దళితులకు భూ పంపిణీ వంటి అనేక కార్యక్రమాలను అమలు చేసిందని గుర్తు చేశారు. పేద, మధ్యతరగతి ప్రజల మనోభావాలను గౌరవిస్తూ వారి అభ్యున్నతికి పని ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. గత పాలకులు ప్రజల ప్రయోజనాలు పట్టించుకోలేదని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తమ హయాంలో నిర్మించిన శ్రీరాంసాగర్, మానేర్, నాగార్జున సాగర్, కడెం, ఎల్లంపల్లి వంటి ప్రాజెక్టులు నేటికి ప్రజలకు సేవలు అందిస్తున్నాయని అన్నారు. రైతును రాజు చేసేందుకు ఉచిత విద్యుత్ వంటి అనేక పథకాలను ప్రారంభించామని అన్నారు.
మహిళలకు వడ్డి లేని రుణాలు పథకం ప్రారంభించి రెండు సార్లు ఇప్పటికే చెల్లింపులు చేశామని అన్నారు. గత పాలకులు వడ్డి లేని రుణాల లబ్ది మహిళలకు ఎగొట్టిందని ఆయన విమర్శించారు. మహిళా సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఐకేపి ద్వారా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
మహిళలను కోటీశ్వరులు చేయాలని లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. మొదటి సంవత్సరం 21 వేల కోట్ల రూపాయలు వడ్డి లేని రుణాలు మహిళా సంఘాలకు అందించడంతో పాటు లోన్ బీమా, ప్రమాద బీమా వంటి పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు.
మహిళల ఆదాయం పెంచెందుకు స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, పాడి పశువుల పెంపకం, ఇందిరా శక్తి క్యాంటీన్, ఆర్టిసి కు అద్దె బస్సులు, పాఠశాలలకు ఏకరూప దుస్తులు కుట్టడం వంటి అనేక మార్గాలను అన్వేషిస్తున్నామని అన్నారు.
ఆర్థికంగా అనేక కష్టాలు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో 93 లక్షల పేద కుటుంబాలకు రాష్ట్రంలో సన్న బియ్యం రేషన్ కార్డు ద్వారా సరఫరా చేస్తున్నామని, అర్హులైన పేదలకు నూతన రేషన్ కార్డుల పంపిణీ చేస్తున్నామని అన్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని అన్నారు.
*జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ,* మన జిల్లాలో ఒక పెట్రోల్ బంక్ దివ్యాంగుల ద్వారా ఏర్పాటు చేశామని, ప్రస్తుతం మహిళా సంఘాల ద్వారా మరో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.
మహిళా సంఘాల ద్వారా నడిపే పెట్రోల్ బంక్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా నారాయణ పేట జిల్లాలో మొదటి సారి ఫ్రారంభిఝచారని, అనంతరం సంగారెడ్డి జిల్లాలో పెట్రోల్ బంక్ ఏర్పాటైందని, రాష్ట్రంలో మహిళా సంఘాల ద్వారా నడిచే 3వ పెట్రోల్ బంక్ సిరిసిల్ల జిల్లాలో ప్రారంభించామని అన్నారు.
రాబోయే 3 నెలలో మహిళా సంఘాల ద్వారా మరో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. పెట్రోల్ బంక్ ద్వారా లక్షల రూపాయల ఆదాయం వస్తుందని, ఆ నిధులను రివాల్వింగ్ ఫండ్ లో పెట్టి బాగా వినియోగించుకోవాలని అన్నారు. మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ను త్వరగా పూర్తి చేయడంలో కృషి చేసిన అధికారులు, సిబ్బంది కు కలెక్టర్ అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ ఆదికారి లక్ష్మీ రాజం, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ లక్ష్మి, స్థానిక నాయకులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.