బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఆమోదం పట్ల ముదిరాజ్ సంఘం హర్షం

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఆమోదం పట్ల ముదిరాజ్ సంఘం హర్షం
హైదరాబాద్ 12 జూలై 2025: తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్‌ జారీ చేయడానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముదిరాజ్ సంక్షేమ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి సన్మానించారు. మెదక్ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు తో కలిసి శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిశారు. బీసీ రిజర్వేషన్ల పట్ల కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నందుకు హర్షం వ్యక్తం చేస్తూ శాలువాతో సన్మానించారు. కేబినెట్ సమావేశంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళతామని ప్రభుత్వం ప్రకటించడం పట్ల వారు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ముదిరాజ్ సంఘం ప్రతినిధులు చొప్పరి రామచంద్రం, బోయిన దేవరాజు, అలివేణి రమేష్, పండుగ స్వామి తదితరులు ఉన్నారు.

Post a Comment

Previous Post Next Post