కోడెల రక్షణకు పట్టిష్ట చర్యలు చేపడుతున్నాం.. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి

కోడెల రక్షణకు పట్టిష్ట చర్యలు చేపడుతున్నాం.. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి
300 మంది కోడెలను స్థానిక రైతులకు పంపిణీకి చర్యలు

500 పశువులకు ఎల్.ఎస్.డి వ్యాక్సినేషన్ పూర్తి

అనారోగ్యం బారిన పడిన 16 కోడెలకు చికిత్స అందించి బ్రతికించాం

అకాల వర్షాలు, అనారోగ్య పరిస్థితుల కారణంగా మొత్తం 17 కోడెలు మృత్యువాత

ఈ మెడికల్ క్యాంపు కోడెలు పూర్తి ఆరోగ్యంగా అయ్యేవరకు నిర్వహిస్తాము

తిప్పాపూర్ లోని గోశాలలో కోడెలు హెల్త్ బుల్లెట్ విడుదల చేసిన జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి

రాజన్న సిరిసిల్ల, జూన్-01: వేములవాడ తిప్పాపూర్ గోశాలలో ఉన్న కోడెల రక్షణకు పట్టిష్ట చర్యలు చేపట్టామని, ఈ మెడికల్ క్యాంపు కోడెలు పూర్తి ఆరోగ్యంగా అయ్యేవరకు నిర్వహిస్తామని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

అకాల వర్షాలు అనారోగ్య పరిస్థితుల కారణంగా తిప్పాపూర్ లోని గోశాలలో మొదట 8 కోడెలు మరణించగా జిల్లా యంత్రాంగం వెంటనే అప్రమత్తమై 5 వెటర్నరీ డాక్టర్లతో కూడిన 12 మంది వైద్య బృందం ఏర్పాటు చేసి గోశాలలోని పశువులను పరిశీలించడం జరిగింది.  

రెండవ రోజు అనారోగ్య కారణంతో మరో 5 కోడెలు మరణించాయి. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కోడెల ఆరోగ్య స్థితిగతులను పరిశీలించి ఎల్.ఎస్.డి వ్యాక్సిన్ 500 పశువులకు వేసామని తెలిపారు. అనారోగ్యం పాలైన 20 పశువులను ప్రత్యేకంగా చికిత్స అందించి వాటిలో 16 పశువుల ప్రాణాలు రక్షించామని, మరో 4 కోడెలు మరణించాయని అన్నారు. 

గోశాలలో మొత్తం 17 కోడెలు అనారోగ్య పరిస్థితులతో మరణించాయని, మిగిలిన పశువులు ఆరోగ్యంగా ఉన్నాయని ఈ మెడికల్ క్యాంపు కోడెలు పూర్తి ఆరోగ్యంగా అయ్యేవరకు నిర్వహిస్తామని , 300 కోడెలను స్థానిక రైతులకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశామని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అసత్య ప్రచారాలను రాజన్న స్వామి భక్తులు నమ్మవద్దని, కోడెల ఆరోగ్య సంరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డా. రవీందర్ రెడ్డి పేర్కొన్నారు.

Post a Comment

Previous Post Next Post