రేపు ప్రజావాణి కార్యక్రమం రద్దు: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ
రాజన్న సిరిసిల్ల, జూన్, 15: జిల్లా సమీకృత కార్యాలయ భవనం (కలెక్టరేట్) లో సోమవారం నాడు (16.06.2025) నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున ప్రజలు వివిధ సమస్యలపై వినతులు ఇవ్వడానికి కలెక్టరేట్ కు రావద్దని విజ్ఞప్తి చేశారు.
పరిపాలన పరమైన కారణాల దృష్ట్యా సోమవారం ప్రజావాణి కార్యక్రమం ను రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ఈ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించవససినదిగా కోరారు.