ముదిరాజ్ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పించడంపట్లహర్షంరాష్ట్రంలో అధిక జనాభా కలిగిన ముదిరాజ్ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పించిన సందర్భంగా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ముదిరాజ్ సంఘం నాయకులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు. ముదిరాజ్ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారం సందర్భంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి ఇచ్చిన హామీ ప్రకారం వాకిటి శ్రీహరికి మంత్రివర్గంలో చోటు కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. రానున్న రోజుల్లో ముదిరాజులను బిసి-డి నుంచి ఏ లోకి మార్చాలని కోరారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లోను తమ వారుగానికి అధిక ప్రాధాన్యతనివ్వాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో జిల్లా అధ్యక్షులు చొక్కాల రాముతో పాటు ఉపాధ్యక్షులు పంబాల దేవరాజ్, సంయుక్త కార్యదర్శి జంగపల్లి శేఖర్, రాయిని ప్రతాప్, సిరిసిల్ల టౌన్ అధ్యక్షులు వంకాయల కార్తీక్, కోల నరేష్, మామిండ్ల నారాయణ, కాంగ్రెస్ నాయకులు మునిగల రాజు, చుక్క శేఖర్, బల్లెపు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
ముదిరాజ్ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పించడంపట్లహర్షం
byJanavisiontv
-
0