జిల్లాలో త్వరలో సాండ్ ట్యాక్స్ అమలు
ట్రాక్టర్ యజమానులు పూర్తి వివరాలు కలెక్టరేట్లో నమోదు చేసుకోవాలి
వారం రోజుల్లోగా దరఖాస్తులు అందజేయాలి
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
రాజన్న సిరిసిల్ల, మే 14 2025: జిల్లాలో త్వరలో సాండ్ ట్యాక్స్ ద్వారా ఇసుక రవాణాకు అనుమతి ఇవ్వనున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఇసుక రవాణా పూర్తిగా త్వరలో ఆన్లైన్ చేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలోని ట్రాక్టర్ అందరు యజమానులు, బాధ్యులు తమ వాహనాల లైసెన్స్, ఇతర అన్ని పత్రాలు, డ్రైవర్ వివరాలు డ్రైవింగ్ లైసెన్సు తదితర పత్రాలు.. అలాగే జిల్లా కలెక్టర్ పేరిట రూ. 10 వేల డీడీ తీయాలని తెలిపారు. ఆయా వివరాలు, పత్రాలను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సీ సెక్షన్ సూపరింటెండెంట్ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. వాహన యజమానులు, బాధ్యులు ఈ వివరాలన్నీ వారం రోజుల్లోగా అందజేయాలని కలెక్టర్ తెలిపారు.
జిల్లాలో అనుమతి పొందిన సాండ్ రీచ్ ల నుంచి మాత్రమే ఇసుక రవాణా చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.