సిరిసిల్ల ప్రెస్ క్లబ్ పాలకవర్గానికి నామినేషన్ల సమర్పణ
సిరిసిల్ల, 01 ఏప్రిల్ : సిరిసిల్ల ప్రెస్ క్లబ్ పాలకవర్గ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయిన విషయం తెలిసిందే. ఆదివారం నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభమవగా మొదటి రోజు ఆదివారం ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. అధ్యక్ష స్థానానికి ఆకుల జయంత్, రాపెల్లి భాస్కర్, చింతకింది శ్యామ్ నామినేషన్లు దాఖలు చేశారు.
ఉపాధ్యక్ష స్థానానికి కాసనగొట్టు రమణయ్య, ఎస్ డి కలీం, ఏ రఘువీర్ గౌడ్, జాన దయానంద్, బొడ్డు పర్షరాములు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ప్రధాన కార్యదర్శి స్థానానికి పరకాల ప్రవీణ్, ఇస్మత్ మోయిన్, ఆడెపు మహేందర్ నామినేషన్ వేయగా, సహాయ కార్యదర్శి స్థానానికి కంకణాల శ్రీనివాస్, షేక్ అజ్గర్ హుస్సేన్, కోశాధికారి స్థానానికి గోవిందు వేణు, వంకాయల శ్రీకాంత్, వడ్నాల వేణు నామినేషన్లు సమర్పించారు. ఆరు కార్యవర్గ స్థానాలకు దుమాల రాము, ప్రయాకర్ రావు వేణు, బుస్స రామనాథం, అహ్మద్ అన్సార్ అలీ, ఎండి పాషా, చౌటపల్లి వెంకటేశం, ముండ్రాయి శ్రీనివాస్, జంగిలి రాజు నామినేషన్లు సమర్పించారు. నేటితో నామినేషన్ల పర్వం ముగిసింది. మొత్తం 82 మంది సభ్యులు ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. బుధవారం నామినేషన్ల పరిశీలన, గురువారం నామినేషన్ల ఉపసంహరణ, ఆదివారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు పోలింగ్ అనంతరం పోలైన ఓట్లను లెక్కించి గెలిచిన అభ్యర్థులను ప్రకటిస్తారు.
Tags
press club Sircilla