ఎట్టకేలకు తెరుచుకున్న చిత్రబార్

ఎట్టకేలకు తెరుచుకున్న చిత్ర బార్ 
సిరిసిల్ల, 02 ఏప్రిల్: ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించలేదనే కారణంతో సిరిసిల్ల పట్టణంలోని చిత్ర బార్ అండ్ రెస్టారెంట్ ను జనవరి 29న మున్సిపల్ అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా సీజ్ చేయడమేంటని బార్ యాజమాన్యం అధికారులను నిలదీశారు. లైసెన్స్ ఫీజు కట్టాలని ముందస్తు నోటీసులు జారీ చేయాలి కానీ ఇలా సీజ్ చేయడం సరికాదని బార్ నిర్వాహకులు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ.. ఈ విషయంపై కోర్టుకు వెళ్తామని నిర్వాహకులు అధికారులతో వాగ్వాదానికి దిగిన సంగతి పట్టణంలో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే, తదనంతర పరిణామాల్లో బార్ సీజ్ అంశం కోర్టుకు చేరుకుని వాదోపవాదాలు జరిగిన పిదప ఎట్టకేలకు కోర్టు ఆదేశాలతో బుధవారం చిత్ర బార్ ను అధికారులు తెరిపించారు.

Post a Comment

Previous Post Next Post