సిరిసిల్ల మానేరు వాగులో చెక్ డ్యాం పునర్ నిర్మాణానికి ఆదేశం
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
దెబ్బతిన్న కరకట్టను ఈ.ఎన్.సీ శంకర్ తో కలిసి పరిశీలన
రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ -09, 2025: సిరిసిల్ల మానేరు వాగులో దెబ్బతిన్న చెక్ డ్యాంను పునర్నిర్మించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. సిరిసిల్ల పట్టణ సమీపంలోని మానేరు వాగులో సాయిబాబా ఆలయం సమీపంలో దెబ్బతిన్న చెక్ డ్యాంను కలెక్టర్, ఈఎన్ సీ శంకర్ తో కలిసి బుధవారం పరిశీలించారు. వెంటనే పునర్నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు.
మానేరు బ్రిడ్జి నుంచి సాయి బాబా ఆలయం వరకు మూడు కిలోమీటర్ల పొడవు కరకట్ట పునర్నిర్మాణాన్ని ప్రారంభించాలని ఆదేశించారు. కార్యక్రమంలో నీటి పారుదల శాఖ ఈ.ఈ.లు అమరేందర్ రెడ్డి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
Tags
Sircilla