రైతులకు ఇబ్బంది కలుగకుండా ధాన్యం సేకరించాలి:జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ
నాణ్యమైన ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేయాలి
మిల్లుల అలాట్మెంట్ జరగని కొనుగోలు కేంద్రాల ధాన్యం గోదాములకు: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ
ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద 2 లారీలను అందుబాటులో పెట్టాలి
ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో ప్రారంభించాలి
ధాన్యం కొనుగోలు పై సమీక్షించిన జిల్లా కలెక్టర్
రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 22: యాసంగి పంట కొనుగోలు లో రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే నాణ్యమైన వరి ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అధికారులను ఆదేశించారు.మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ధాన్యం కొనుగోలు పై సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ,* రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ జిల్లాలో జరగాలని అన్నారు.
కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే చెల్లింపులు పూర్తి చేయాలని అన్నారు. మన జిల్లాలో ఇప్పటి వరకు 241 కొనుగోలు కేంద్రాలకు గాను 239 కేంద్రాల ప్రారంభం చేసి 198 కొనుగోలు కేంద్రాల నుంచి 16 వేల 22 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు జమ అయ్యేలా చూడాలని అన్నారు.
సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసిల్దార్ లు సిరిసిల్లలో అపెరల్ పార్క్ లో మరియు ఇతర చోట్ల అవసరమైన ఇంటర్మీడియట్ గోదాములను గుర్తించి ధాన్యం తరలింపు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కొనుగోలు కేంద్రాలకు ట్యాగ్ చేసిన రైస్ మిల్లర్లకు సామర్థ్యం ప్రకారం ధాన్యం అలాట్మెంట్ చేయాలని అన్నారు.
మిల్లు అలాట్మెంట్ కాని కోనుగోలు కేంద్రాలకు సమీపంలో గల అపెరల్ పార్క్ లో ఇంటర్మీడియట్ గోదాము నందు ధాన్యం భద్రత కోసం బుక్ చేయాలని అన్నారు. రైస్ మిల్లుల సమస్య కారణంగా ఎక్కడా ధాన్యం కొనుగోలు ఆలస్యం కావడానికి వీలు లేదని, కొనుగోలు కేంద్రాలకు వచ్చే నాణ్యమైన ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లించాలని కలెక్టర్ సూచించారు.
రైస్ మిల్లులకు నాణ్యమైన ధాన్యాన్ని మాత్రమే సరఫరా చేయాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన వసతులు కల్పించాలని, ప్యాడీ క్లీనర్, టార్ఫాలిన్ కవర్లు, వెయింగ్ యంత్రాలు తేమ యంత్రాలు మొదలగు సామాగ్రి అందుబాటులో పెట్టుకొవాలని అన్నారు. కోనుగోలు కేంద్రాలలో నాణ్యత ప్రమాణాలు పరిశీలించి, భారత ఆహార సంస్థ నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలు ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అన్నారు.
సిరిసిల్ల జిల్లాలో నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో ప్రారంభించాలని అన్నారు.ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద 2 లారీలను అందుబాటులో పెట్టాలని, ధాన్యం రవాణా ఎటువంటి ఇబ్బందులు ఉండవద్దని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ సమీక్షా సమావేశంలో డిఆర్డిఓ శేషాద్రి, డిఏఓ అఫ్జలి బేగం, జిల్లా సహకార అధికారి రామకృష్ణ, పౌర సరఫరాల శాఖ అధికారులు రజిత, వసంత లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.