బిజెపి ఆధ్వర్యంలో సిరిసిల్లలో గావ్ చలో.. బస్తీ చలో అభియాన్

సిరిసిల్ల 19 ఏప్రిల్ 2025: సిరిసిల్ల పట్టణంలో బిజెపి శ్రేణుల ఆధ్వర్యంలో గావ్ చలో.. బస్తీ చలో అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని 23వ వార్డు అంబికానగర్ లో కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రజా సంబంధాల బలోపేతం దిశగా ప్రచారం చేశారు. 

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించారు. భారతీయ జనతా పార్టీ విధానాలను ఇంటింటికి తీసుకెళ్లడంలో భాగంగా బిజెపి పట్టణ మహిళా అధ్యక్షురాలు వేముల వైశాలి సురేష్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ప్రచారం నిర్వహించారు. ప్రచార కార్యక్రమంలో మామిడాల మహేష్, చేపూరి అశోక్, అంకరపు రాజు, వంగ అనిల్, ఇన్చార్జులుగా ఇతర ముఖ్య నాయకులు అడెపు రవీందర్, కోడం రవి, నల్గొండ సాయిచంద్, కర్నే హరీష, పండుగ మాధవి, కొంపెల్లి శివశంకర్, పాముల ఆంజనేయులు, వేముల లక్ష్మణ్, గూడూరు భాస్కర్, అన్నల్ దాస్ వేణు, వేముల సాగర్, తాటిపాముల విష్ణు, సత్యం, కర్నె రేవంత్, దయాసాగర్, హరీష్, కర్నె గణేష్, బాలకిషన్, ప్రసాద్, బండారి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post