పేదింటి వివాహానికి పుస్తె మట్టెల వితరణ
సిరిసిల్ల, 08 మార్చ్ (జనవిజన్ న్యూస్): పేదింటి వివాహాలకు చిట్నేని-ఆగమ్మ నర్సింగరావు ట్రస్ట్ సహకారంతో చిట్నేని వెంకటేశ్వరరావు-మాధవి దంపతుల ఆధ్వర్యంలో పుస్తె మట్టెల వితరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో పెద్దూరు పరిధిలోని వంశీకృష్ణ కాలనీలో
ఆరె సత్తవ్వ - ముత్తయ్య దంపతుల కుమార్తె ఆరే చందన వివాహం జరగనుండగా శనివారం సీనియర్ కాంగ్రెస్ నాయకులు చెన్నమనేని కమలాకర్ రావు చేతుల మీదుగా పుస్తె మట్టెలను అందించారు. ఈ సందర్భంగా పుస్తె మట్టెలను అందించిన ట్రస్ట్ వారికి కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పెద్దూరు మాజీ సర్పంచ్ రాకం రమేష్, మాజీ వార్డ్ సభ్యులు ఆదిపెళ్లి దేవయ్య తదితరులు పాల్గొన్నారు.
Tags
Peddur