సిరిసిల్ల జిల్లాలో నక్కదాడిలో నలుగురికి గాయాలు . . ఉలిక్కిపడ్డ జనం
అడవిలో ఉండవలసిన జంతువు జనావాసాల్లోకి వచ్చి ప్రజలపై దాడి చేయడంతో భయభ్రాంతులకు గురయ్యారు. జిల్లాలోని ముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామంలో నేడు ఉదయం ఐదున్నర గంటల ప్రాంతంలో నలుగురు వ్యక్తులపై ఓ నక్క దాడి చేసింది. ఇందులో ఓ మహిళ ముఖంపై తీవ్రంగా గాయాలు కావటంతో ఆసుపత్రికి తరలించారు. ప్రాణ భయంతో స్థానికులు నక్కను వెంబడించి కర్రలతో కొట్టి చంపినట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తమను అడవి జంతువుల బారి నుంచి రక్షించాలంటూ అటవీశాఖ అధికారులకు గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేసారు.