వాహనదారులకు రవాణా శాఖ అధికారుల సూచనలు

జాతీయ రోడ్డుభద్రత మాసోత్సవాల సందర్బంగా 
రాజన్న సిరిసిల్లా రవాణాశాఖ ఆద్వర్యంలో నేడు నిర్వహించిన వాహనాలకు ముందు, వెనక ప్రక్క వైపులకు రెడియం స్టిక్కర్స్ అంటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ రాధికా జైస్వాల్ పాల్గొని డ్రైవర్లకు డ్రైవింగ్ లో తీసుకోవలసిన నిబంధనలు తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపొద్దు అని చెప్పారు. అధిక వేగం, సీట్ బెల్ట్ లేకుండా ప్రయానించవద్దని అన్నారు. ద్విచక్ర వాహనం నడుపువారు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. అటుగా వెళుతున్న ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారులో ప్రయానించి సీట్ బెల్ట్ ధరించిన వాహన దారులకు స్వీట్స్ తో పాటు బహుమతి అందించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకుండా వాహనము నడిపిన వారికీ గులాబీ పువ్వు ఇచ్చి సున్నితంగా మందలించారు. కార్యక్రమం అనంతరం వాహన డ్రైవర్లతో ప్రమాదలు జరగకుండా వాహనాలు నడుపుతామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి వి.లక్ష్మన్, మోటారు వాహన తనిఖీ అధికారి జి వంశీదర్, సహాయక మోటారు వాహనాల తనిఖీ అధికారి రజనీదేవి, పృద్విరాజ్ వర్మ, కానిస్టేబుల్ రమ్య, సౌమ్య, ప్రశాంత్, హోం గార్డ్ ఎల్లయ్య, సిబ్బంది కల్పన, శ్రావణి, ట్రాక్టర్ ట్రైలర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పాటి రాజ్ కుమార్, వాహన డ్రైవర్లు, ఓనర్లు, సుమారు వందమంది వాహన దారులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post