హైదరాబాద్‌లో ఐటీ సోదాలు- దిల్ రాజు సహా నిర్మాతల ఇళ్లు, ఆఫీసులపై ఆకస్మిక దాడులు
హైదరాబాద్: హైదరాబాద్‌లో పలు చోట్ల ఐటీ అధికారులు ఆకస్మిక దాడులు చేస్తున్నారు. గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాము సినిమాలు నిర్మించిన దిల్ రాజు ప్రొడక్షన్స్ పై ఐటీ అధికారులు ఫోకస్ చేశారు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, లతో పాటు దిల్ రాజు కూతురు హన్సితా రెడ్డిలకు సంబంధించిన ఆస్తులపై ఐటి సోదాలు చేపట్టినట్లు సమాచారం. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లలో పలు నిర్మాతల ఇళ్లు, ఆఫీసులు, ఇతర ఆస్తులపై ఐటీ అధికారులు తనిఖీలు జరుగుతున్నాయి. ఏకకాలంలో 8 చోట్ల దాదాపు 50 మంది అధికారులు తనిఖీలు చేస్తున్నారు.