నిఘా నీడలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్

నిఘా నీడలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్
Shamshabad Airport under surveillance
హైదరాబాద్, జనవరి 22: గణతంత్ర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు నిఘవర్గాలు రెడ్ అలర్ట్ ప్రకటించాయి. జనవరి 26న దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా పోలీసులు, భద్రతా అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో నిఘా వర్గాలు అలెర్ట్ అయ్యారు. ఈ నెల 30 వరకు ఎయిర్ పోర్ట్లో రెడ్ అలెర్ట్ కొనసాగుతుందని తెలిపారు. ఈనెల 30 వరకు ఎయిర్ పోర్ట్కు సందర్శకులు ఎవరు రావద్దని ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా సిఐఎస్ఎఫ్ భద్రతా అధికారులు ఎయిర్ పోర్టులో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎయిర్ పోర్ట్ ప్రధాన దారిలో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపడుతున్నారు. ఎయిర్ పోర్ట్‌కు వచ్చే వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. అనుమానం వచ్చిన వాహనాలను ఆపి తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌కు వచ్చే సందర్శకులకు అధికారులు అనుమతి నిరాకరించారు. అనుమానితులు, అనుమానిత వస్తువులు, అనుమానిత వాహనాలు కనిపిస్తే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post