రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రయాణికుల సురక్షిత భద్రత కోసం అభయ యాప్: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

Abhaya app for the safety and security of passengers in Rajanna Sircilla district: SP Akhil Mahajan
జిల్లాలో ప్రయాణికుల సురక్షిత,భద్రత కోసం అభయ యాప్( MY AUTO IS SAFE) ఫేజ్-2లో భాగంగా 800 ఆటోలకి QR కోడ్ తో అనుసంధానం, ప్రమాద భీమా పత్రాలు అందజేత

ప్రయాణికులకు ఆటోలో సురక్షితంగా ప్రయణిస్తున్నామనే నమ్మకం కలిగించాలి

ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ,పరిమితి లోపు ప్రయాణికులను ఎక్కించుకోవాలి: జిల్లా ఎస్పీ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆటోలకు అభయ QR కోడ్, డ్రైవర్లుకు ప్రమాద భీమా పత్రాలు అందజేసిన జిల్లా ఎస్పీ

రాజన్నసిరిసిల్ల, 22 జనవరి: ప్రయాణికుల సురక్షిత, భద్రత కోసం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న ప్యాసింజర్ వాహనాలకు మొదటి దశలో 4 వేల వాహనాలకు అభయ యాప్ QR కోడ్ ని అనుసంధానం చేయడం జరిగిందని ఎస్పీ అఖిల్ మహాజన్ చెప్పారు. రెండవ దశలో కొత్తగా 800 వాహనాలకు అనుసంధానం చేయడంతో పాటు అభయ యాప్ తో వాహనాల డ్రైవర్లకు 50 రూపాయలతో యాక్సిడెంట్ డెత్ కు లక్ష రూపాయల ఇన్సూరెన్స్ వచ్చేలా ఒక సంస్థతో అనుసంధానం చేసి ప్రమాద భీమా పత్రాలు అందించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వివిధ ప్రాంతాల నుండి జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ పట్టణంతో పాటు వివిధ ప్రాంతాలకు అనునిత్యం వేలాది మంది ప్రయాణికులు వస్తారని వారి రక్షణ దృష్ట్యా జిల్లాలో మొదట దశలో 4 వేల ప్యాసింజర్ వాహనాలకు అభయ యాప్ My Auto is Safe అనే QR కోడ్ అనుసంధానం చేయడంతో పాటు ప్రమాద భీమా అందించడం జరిగిందని అన్నారు. రెండవ దశలో జిల్లాలో కొత్తగా 800 వాహనాలకు QR కోడ్ అనుసంధానం చేయడంతో పాటుగా అభయ యాప్ తో వాహనాల డ్రైవర్లకు 50 రూపాయలతో యాక్సిడెంట్ డెత్ కు లక్ష రూపాయల ఇన్సూరెన్స్ వచ్చేలా ఒక సంస్థతో అనుసంధానం చేసి ప్రమాద భీమా పత్రాలు అందించడం జరిగిందని దీనిని ప్రతి సంవత్సరం 50 రూపాయలతో రిన్యువల్ చేసుకోవాలన్నారు. ప్రయాణికులు ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో ఆసురక్షితంగా భావించే ఏదైనా పరిస్థితిని సంఘటనలను ఎదుర్కొన్నపుడు ఆటోకి ముద్రించిన "క్యూ అర్ కోడ్"ను స్కాన్ చేయాలని స్కాన్ చేయగానే వెంటనే డ్రైవర్ ఫోటో, వివరాలతో పాటుగా వాహనంకి సంబంధించిన వివరాలు వస్తాయని తెలిపారు. స్కాన్ చేసిన వ్యక్తి ఫోన్ నెంబర్ యాప్ లో ఎంట్రీ చేసి ట్రేస్ ద లొకేషన్ అని ఎంట్రీ చేయగానే వాటితో పాటుగా ఎమర్జెన్సీ కాల్, ఎమర్జెన్సీ కంప్లైంట్ ఆప్షన్స్ రావడం జరుగుతుందన్నారు. ఎమర్జెన్సీ కాల్ లేదా టెక్స్ట్ రూపంలో స్పందించినప్పుడు ప్రయాణికులు ప్రయాణిస్తున్న ప్యాసింజర్ వాహనం యొక్క లైవ్ లొకేషన్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కి వెళ్తుందని, ఆటోలో ఎక్కినప్పటి నుండి దిగేంతవరకు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా మానిటర్ చేయడం జరుగుతుందని తెలిపారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా సమీపంలో ఉన్న పోలీసులు అక్కడికి చేరుకొని తగు రక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఆటోలో ఎక్కిన మహిళలు, ప్యాసింజర్లు ఆటో ఎక్కే ముందు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవాలని, ఆటో డ్రైవర్ వివరాలు నెంబర్ తో యుక్తంగా వస్తాయని, ఆటోలో ఏదైనా విలువైన వస్తువులు మరిచిపోతే వెంటనే ఆటోను ట్రేస్ అవుట్ చేసి అప్పగించడానికి వీలుంటుందని అన్నారు.

గతంలో ఆటో డ్రైవర్ ఏదైనా పోలీస్ కేసులో ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే థిస్ ఆటో నాట్ సేఫ్ అనే రెడ్ సిగ్నల్ వస్తుంది, ఇది ప్రయాణికులకు సేఫ్ జర్నీ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. 

ఆటో డ్రైవర్లు ఏదైనా నేరాలకు పాల్పడిన చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన సిసి కెమెరాల ద్వారా కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.

ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు డ్రైవర్ ప్రయాణికులతో అసభ్యకరంగా ప్రవర్తించిన,ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, హిట్ అండ్ రన్ చేసిన ఈ అప్ ద్వారా కంప్లైంట్ చేయవచ్చు. అదేవిదంగా ప్రయాణికులు వారు ప్రయాణిస్తున్న వాహనం కి రేటింగ్ కూడా ఇవ్వవచ్చు అన్నారు.

ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ ట్రాఫిక్ నియంత్రణలో భాగస్వామ్యం కావాలని, ఆటో లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని సూచించారు.

ఈ కార్యక్రమంలో డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి,సి.ఐ కృష్ణ, ట్రాఫిక్ ఎస్.ఐ లు రాజు, రమేష్, అభయ యాప్ సృష్టి కర్త అభిచరన్ ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post