చిలుకూరు బాలాజీని దర్శించుకున్న బాలివుడ్ సినీనటి ప్రియాంక చోప్రా

Bollywood-actress-Priyanka-Chopra-visits-Chilkur-Balaji
చిలుకూరు బాలాజీని దర్శించుకున్న బాలివుడ్ సినీనటి ప్రియాంక చోప్రా

తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని బాలివుడ్ సినీ నటి ప్రియాంక చోప్రా సందర్శించి స్వామి వారిని దర్శించుకున్నారు.

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు సమీపంలో గల చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని సినీమా నటి ప్రియాంక చోప్రా సందర్శించడంతో ఆమెకు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, సత్కరించారు. ఈ సందర్భంగా చిలుకూరు బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకులు రంగరాజన్ మాట్లాడుతూ.. వీసాల దేవుడిగా భక్తులకు కొంగుబంగారంగా నిలిచి, తెలంగాణ తిరుపతిగా పేరు గాంచిన చిలుకూరు బాలాజీ అందరికీ ఆశీర్వాదం ఇస్తారని అన్నారు. భక్తులు దేవుని నమ్మినప్పుడే దేవుడు భక్తులకు కోరుకున్న కోరికలు తీరుస్తారని అన్నారు. చిలుకూరు బాలాజీ దేవాలయానికి రాష్ట్రం తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు ఎంతోమంది స్వామివారిని దర్శించుకోవడానికి విచ్చేయడం ఆదర్శమన్నారు. ప్రియాంక చోప్రా స్వామి వారిని దర్శించుకోవడం ఆమెకు బాలాజీ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సన్మానించడం జరిగిందని తెలిపారు.

Post a Comment

Previous Post Next Post