దేశ సేవకు ఎన్నికైన జవాన్ కు స్వగ్రామంలో ఘన స్వాగతం

దేశ సేవకు ఎన్నికైన జవాన్ కు స్వగ్రామంలో ఘన స్వాగతం

రాజన్నసిరిసిల్ల, 21 జనవరి: భారత సాయుధబలగంలోని సహస్ర సీమా విభాగంలో అసిస్టెంట్ కమాండర్ స్థాయి హోదా ఉద్యోగం పొంది, శిక్షణ పూర్తి చేసుకుని మొదటిసారి తన స్వంత గ్రామం, సిరిసిల్ల మున్సిపల్ పరిదిలోని పదో వార్డు ముష్టిపల్లికి వచ్చిన కొమిరి ప్రదీప్ గౌడ్ కు స్థానికులు ఘన స్వాగతం పలికారు. వార్డు కౌన్సిలర్ బొల్గం నాగరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ బొల్గం నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ.. భారత దేశ రక్షణ కోసం, భారతమాత సేవ కోసం ఒక అసిస్టెంట్ కమాండ్ స్థాయి ర్యాంకు కలిగిన ఉద్యోగి మన వార్డు పరిధిలో ఉండడం చాలా గర్వకారణమని అన్నారు. ప్రదీప్ ను ఆదర్శంగా తీసుకొని యువకులందరూ తాము అనుకున్న లక్ష్యాలను సాధించాలని అన్నారు. భారతదేశానికి సేవ చేసేందుకు దేశ సేవలో ముందుకెళ్తున్న ప్రదీప్ గౌడ్ ను ప్రోత్సహించిన ఆయన తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు. యువత తాము అనుకున్న లక్ష్యాలను సాధించడానికి విద్యా ఉద్యోగ రంగాల్లో మొదట ఉండాలని, ఈ విషయంలో తనకు తోచిన సహాయం చేస్తారని ఈ సందర్భంగా కౌన్సిలర్ బొల్గం నాగరాజు గౌడ్ తెలిపారు.

Post a Comment

Previous Post Next Post