బ్యాంకుల వద్ద భద్రతపై అదనపు ఎస్పీ డి. చంద్రయ్య

బ్యాంకు బ్రాంచీలు, ఏటిఎం భద్రతా ఏర్పాట్ల పై సంబంధిత అధికారులతో సమీక్షించిన అదనపు ఎస్పీ

రాజన్న సిరిసిల్ల, జనవరి- 28: జిల్లాలోనే బ్యాంకు బ్రాంచీలు, ఏటిఎం సెంటర్ లో వద్ద భద్రత ఏర్పాట్లు పకడ్బందీగా ఉండేలా చూసుకోవాలని అదనపు ఎస్పీ డి.చంద్రయ్య సంబంధిత అధికారులను ఆదేశించారు.
మంగళవారం అదనపు ఎస్పీ డి.చంద్రయ్య సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో బ్యాంకు బ్రాంచీలు, ఏటిఎం భద్రతా ఏర్పాట్ల పై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా *అదనపు ఎస్పీ డి.చంద్రయ్య మాట్లాడుతూ,* బ్యాంకులు ,ఏటీఎం కేంద్రాల వద్ద ఎటువంటి దుర్ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఉత్తమం అని అన్నారు. బ్యాంకు బ్రాంచ్, ఏటిఎం కేంద్రాలు నిర్దేశిత భద్రత ప్రమాణాల పాటించాలని సూచించారు. 

ప్రతి బ్యాంక్ బ్రాంచ్ వద్ద ఎలక్ట్రానిక్ అలారం సిస్టం అందుబాటులో ఉండాలని, బ్యాంకు కార్యాలయాలు, ఏటిఎం సెంటర్ వద్ద తప్పనిసరిగా పని చేసే సీసీ కెమెరాలు ఉండాలని ఎస్పి పేర్కొన్నారు. ఏటీఎం సెంటర్ లోపల మాత్రమే కాకుండా బయట కూడా సీసీ కెమెరాలు ఉండాలని అన్నారు . ఏటిఎం సెంటర్ వద్ద సెక్యూరిటీ గార్డ్ లను అప్రమత్తంగా ఉండాలని, చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించాలని అదనపు ఎస్పీ తెలిపారు.

బ్యాంకుకు సంబంధించి క్యాష్, గోల్డ్ లాకర్స్ తాళాలు డూప్లికేట్ ఉండకుండా చూడాలని అన్నారు. బ్యాంకు కార్యాలయంలో స్టేషనరీ రూమ్, డైనింగ్ మొదలగు అన్ని రకాల రూమ్ లను క్లోజ్ చేయాలని అన్నారు. బ్యాంకు వద్ద భద్రత సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అతను భద్రత వ్యవహారాలు తప్ప మిగిలిన ఎటువంటి పనులు చేసేందుకు వీలు లేదని అన్నారు.

బ్యాంకులలోకి ఎటువంటి ప్రమాదకరమైన వస్తువులు, ఆయూధాలు అనుమతించడానికి వీలులేదని అన్నారు. హెల్మెట్, మాస్క్ వంటివి బ్యాంకులలో నిషేధించాలని అన్నారు. బ్యాంకు వద్ద ఏదైనా సమస్య వస్తే అలారం సిస్టం నుంచి నేరుగా పోలీస్ కంట్రోల్ రూమ్ కు సమాచారం వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తామని అదనపు ఎస్పీ పేర్కొన్నారు. 

ఈ సమావేశంలో లీడ్ బ్యాంకు మేనేజర్ మల్లికార్జున్, బ్యాంక్ కంట్రోలర్స్, బ్యాంక్ మేనేజర్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post