గ్రామీణ యువకులకు LMV, HMV లో ఉచిత శిక్షణ

గ్రామీణ యువకులకు LMV, HMV లో ఉచిత శిక్షణ

(ఐడీటీఆర్/ టైడ్స్), ఆద్వర్యంలో మూడు నెలల పాటు తర్ఫీదు

ప్రొఫెషనల్ డ్రైవర్ లేదా ఓనర్ కమ్ డ్రైవర్‌గా మారడానికి సువర్ణావకాశం

ఈ నెల 29వ తేదీ దాకా పేర్ల నమోదుకు అవకాశం

బ్యాచ్ ప్రారంభ జూలై 1 వ తేదీ
IDTR / TIDES సెక్రటరీ కమ్ ప్రిన్సిపాల్ వీ. దురై మురుగన్

సిరిసిల్ల, జూన్ 18: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ట్రైనింగ్ & రీసెర్చ్ (IDTR) ఆధ్వర్యంలో గ్రామీణ యువకులకు లైట్ మోటార్ వెహికల్ (LMV), హెవీ మోటార్ వెహికల్ (HMV)లో 3 నెలల పాటు ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వనున్నట్లు IDTR / TIDES ( తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్) సెక్రటరీ కమ్ ప్రిన్సిపాల్ వీ. దురై మురుగన్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం & అశోక్ లేలాండ్ లిమిటెడ్ మధ్య జాయింట్ వెంచర్ ఆద్వర్యంలో ఒక ప్రొఫెషనల్ డ్రైవర్ లేదా ఓనర్ కమ్ డ్రైవర్ గా మారేందుకు సువర్ణ అవకాశమని పేర్కొన్నారు. 

LMV & HMV అభ్యర్థులకు సాధారణ ఎంపిక ప్రమాణాలు


ప్రొఫెషనల్ డ్రైవర్ కావాలనే అభిరుచి ఉండి, 20 నుంచి 28 మధ్య వయస్సు ఉండాలి, 10వ తరగతిలో ఉత్తీర్ణత లేదా ఫెయిల్ అయిన ఫర్వాలేదని పేర్కొన్నారు. అభ్యర్థి ఎత్తు 160 సెం.మీ పైన సుమారు 5.25 అడుగులు ఉండాలని స్పష్టం చేశారు.
HMV శిక్షణ కోసం, ఒక సంవత్సరం LMV లైసెన్స్ పూర్తి చేసి ఉండాలి. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు 10వ తరగతి సర్టిఫికెట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, కుటుంబ ఆదాయ ధృవీకరణ పత్రం, సొంత బ్యాంకు ఖాతా జిరాక్స్ కాపీలు, 6 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకురావాలని సూచించారు. ఈ సువర్ణావకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 89854 31720 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

గమనిక
రాజన్న సిరిసిల్ల కాకుండా ఇతర జిల్లాలకు చెందిన వారు తమ జిల్లాల్లో సొంత ఖర్చులతో లెర్నర్స్ లైసెన్స్ (LLR) బుక్ చేసుకోవాలి. శిక్షణ పూర్తయిన తర్వాత లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి కూడా ఇది వర్తిస్తుంది.

Post a Comment

Previous Post Next Post