చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను పరామర్శించిన కేటీఆర్


సతీమణి మరణంతో విషాదంలో ఉన్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కుటుంబాన్ని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పరామర్శించారు. 

ఆల్వాల్ లోని ఎంఎల్ఏ మేడిపల్లి సత్యం నివాసానికి చేరుకొని రూపదేవి చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి అర్పించారు. 

ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు.

కేటీఆర్ వెంట కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు.

Post a Comment

Previous Post Next Post