సిరిసిల్ల, మే 2 : లోక్ సభ ఎన్నికలకు సంబంధించి జిల్లాకు అదనంగా కేటాయించిన బ్యాలెట్ యూనిట్ల సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి అయిందని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.
గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో అదనపు బ్యాలెట్ యూనిట్ల సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు.
రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసి, వేములవాడ, సిరిసిల్ల అసెంబ్లీ సెగ్మెంట్ లకు కేటాయించిన బ్యాలెట్ యూనిట్ల జాబితాను రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేశారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ కోరారు.
సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యా నాయక్, కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రీకాంత్, రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.