సజావుగా పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్
ఇంటి వద్ద ఓటింగ్ నిర్వహణకు 19 బృందాల ఏర్పాటు
మే 3 నుంచి మే 5 వరకు 744 మంది ఓటర్లకు హోం ఓటింగ్ సౌకర్యం
ప్రతి ఓటరుకు ఓటర్ స్లిప్పు అందేలా పక్కా చర్యలు
క్రిటికల్, అర్బన్ పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ క్యాస్టింగ్, సిసి టివి కేమేరాల ఏర్పాటుకు చర్యలు
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ పై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్
రాజన్న సిరిసిల్ల, మే 01: సజావుగా పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి హోం ఓటింగ్, ఓటర్ స్లిప్పుల పంపిణీ, వెబ్ క్యాస్టింగ్, తదితర అంశాల పై పై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ.. పార్లమెంట్ స్థానానికి పోటిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య ఆధారంగా అవసరమైన అదనపు బ్యాలెట్ యూనిట్లు ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని అన్నారు. ఈవిఎం యంత్రాలపై బ్యాలెట్ పత్రాల కమిషనింగ్ కు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.
పారదర్శకంగా హోం ఓటింగ్ ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని, అవసరమైన బృందాలను ఏర్పాటు చేయాలని, మే 3 నుంచి మే 6 వరకు మొదటి విడత, మే 8న రెండవ దశ హోం ఓటింగ్ పూర్తి చేయాలని, హోం ఓటింగ్ షెడ్యూల్ సమాచారం ముందస్తుగా సంబంధిత ఓటర్లకు అందించాలని, ఇంటిలో ఓటు వేసే సమయంలో ఓటర్ల సీక్రసి కాపాడేలా చూడాలని, మొత్తం ప్రక్రియ వీడియోగ్రఫీ చేయాలని అన్నారు.
మే 13నపోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుందని, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగిన అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ సమయాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ 6 గంటల వరకు పొడిగించిందని , సాయంత్రం నాలుగు గంటలకు పోలింగ్ ముగిసిన అసెంబ్లీ సెగ్మెంట్లలో యధావిధిగా సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ ముగుస్తుందని, ఈ అంశాన్ని ప్రజలకు తెలియజేయాలని తెలిపారు.
ప్రతి పార్లమెంట్ పరిధిలో తుది ఓటర్ జాబితా రూపొందించామని, ప్రతి ఓటర్ కు ఓటర్ సమాచార స్లిప్పు పంపిణీ అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
పోలింగ్ కేంద్రాలలో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని, వేసవి కాలంలో పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఓటింగ్ లైన్ల వద్ద నీడ కల్పించేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు.
పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు త్రాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలని, జిల్లాలో వెబ్ క్యాస్టింగ్ చేస్తున్న పోలింగ్ కేంద్రాల వివరాలు సమర్పించాలని, మిగిలిన పోలింగ్ కేంద్రాల బయట సిసి కేమేరాలు ఏర్పాటు చేయాలని అన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి మాట్లాడుతూ.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో తుది ఓటరి జాబితా రూపొందించి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు అందజేయడం జరిగిందని అన్నారు. 744 మంది హోం ఓటింగ్ లో పాల్గోంటున్నారని, మే 3 నుంచి మే 5 వరకు హోం ఓటింగ్ పూర్తి చేసేందుకు 19 బృందాలను ఏర్పాటు చేశామని, హోం ఓటింగ్ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే 2457 సిబ్బంది కోసం వేములవాడ అసెంబ్లీ సెగ్మెంట్ లో నూతన గ్రంథాలయ భవనం(తాసిల్దార్ కార్యాలయం ప్రాంగణంలో) సిరిసిల్ల అసెంబ్లీ సెగ్మెంట్ లో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, గీతానగర్ లో ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలను, పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూములను ఏర్పాటు చేశామని అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటివరకు 2 లక్షల 88 వేల 153 మంది ఓటర్లకు (61%) ఓటర్ సమాచార స్లిప్పులు పంపిణీ చేశామని, పోలింగ్ కేంద్రాలలో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని, జిల్లావ్యాప్తంగా మొత్తం 277 పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్, 197 పోలింగ్ కేంద్రాల బయట సిసి కేమేరాలు ఏర్పాటు చేశామని అన్నారు.
ఈ సమావేశంలో ఆదనపు కలెక్టర్ పి గౌతమి, సిరిసిల్ల, ఆర్డీఓలు రమేష్, డీడబ్ల్యూఓ లక్ష్మీరాజం, సీపిఓ శ్రీనివాసాచారి, కలెక్టరేట్ ఏఓ రాంరెడ్డి
సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.