రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న బీసీ స్టడీ సర్కిల్లో గ్రూప్-1తో పాటు యుపీఎస్సీ సివిల్ సర్వీసెస్(ప్రిలిమ్స్) ఎగ్జామినేషన్ 2024 ఆఫ్ లైన్ లో గ్రాండ్ టెస్టులను నిర్వహిస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి ఒక ప్రకటనలో తెలియజేశారు. టిఎస్పిఎస్సి గ్రూప్- 1 అభ్యర్థులకు: మే నెల లో 18, 20, 22, 25, 27, 29, 31 తేదీలలో, జూన్ నెలలో 01, 03 తేదీలలో అభ్యర్థులకు ఆఫ్ లైన్ పద్ధతిలో బీసీ స్టడీ సర్కిల్ లో గ్రాండ్ టెస్టులు నిర్వహించబడును. అలాగే యుపిఎస్సి సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ 2024 అభ్యర్థులకు కూడా గ్రాండ్ టెస్ట్ లు ఈ తేదీల్లో ఈనెల 23, 26, 28, 30, జూన్ నెలలో 02, 04, 06, 08,10,12 నిర్వహించడం జరుగుతుంది. పైన పేర్కొన్న గ్రాండ్ టెస్టులకు హాజరు కావడానికి అభ్యర్థులు www.tsbcstudycircle.cgg.gov.in ఈ వెబ్ సైట్ లో ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవాలి. మరింత సమాచారం 9381888749, 7702650209 ఈ మొబైల్ నెంబర్స్ లను సంప్రదించగలరని రాజన్న సిరిసిల్ల జిల్ల బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి సూచించారు.
బిసి స్టడీ సర్కిల్ లో ఆఫ్ లైన్ లో గ్రూప్-1తో పాటు యుపీఎస్సీ సివిల్ సర్వీసెస్(ప్రిలిమ్స్) ఎగ్జామినేషన్ గ్రాండ్ టెస్టుల నిర్వహణ
byJanavisiontv
-
0