ప్రెస్ నోట్: షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి, కార్యాలయం, రాజన్న సిరిసిల్ల జిల్ల
తేది :10-04-2024.
ఎస్సీ అభ్యర్థులకు 3 నెలల ప్రత్యేక పౌండేషన్ కోర్సు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ కోసం స్పోట్ అడ్మిషన్ కొరకు దరఖాస్తుల ఆహ్వానం.
2024-25 సంవత్సరానికి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్ అధ్వర్యంలో 3 నెలల ప్రత్యేక ఫౌండేషన్ కోర్సు, రాష్ట్రస్థాయి పోటీ పరీక్షలతో పాటు, 9 జూన్ 2024న నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష కొరకు 100 మంది నిరుద్యోగ అభ్యర్థులకు రెసిడెన్షియల్ పద్దతిలో మూడు నెలలు భోజన, వసతితో కూడిన శిక్షణ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం లో నిర్వహించబడును, 100 మందికి గాను 45 మంది అడ్మిషన్ పొంది ఉన్నారు మిగులు 55 సీట్లకు గాను ఆడ్మిషన్ కలదు. ఇట్టి కోచింగ్ అవకాశం నిరుద్యోగులైన ఎస్సీ యువతీ, యువకులకు మాత్రమే అర్హులైన సంవత్సరానికి తల్లితండ్రుల ఆదాయము మూడు లక్షలు మించలేదని, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. పైన పేర్కొన్న అర్హతలు గల విద్యార్ధులు తమ అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు ఫోటోలు, ఒక సెట్ జిరాక్స్ కాపీలు తీసుకొని 15.04.2024 (సోమవారం) ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ చంద్రంపేట్, సిరి మండి బీర్యాని అపోసిట్ సిరిసిల్ల వేములవాడ మన్ రోడ్ నందు జరిగే స్పోట్ అడ్మిషన్ కొరకు హాజరుకాగలరని తెలియజేయనైనది. ఇతర సమాచారం కొరకు 9515622390 ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చు.
షేడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి, రాజన్న సిరిసిల్ల జిల్లా
శ్రీమతి మెట్టు విజయం లక్ష్మి,
Honorary Director, (FAC), TSSCSC- Rajanna Sircilla