మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

జనవిజన్ న్యూస్ ప్రతినిధి, ఏప్రిల్ 8:
రాజన్న సిరిసిల్ల జిల్ల గంబీరావుపేట మండలం మల్లారెడ్డిపెట్ గ్రామంలో మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆదివారం గ్రామంలో సంఘ సమావేశ స్థలంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పాత కార్యవర్గానికి వీడ్కోలు తెలిపారు. ఆనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన అధ్యక్ష కార్యదర్శులతో పాటు కార్యవర్గ సభ్యులు సంఘం అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అధ్యక్షులుగా దబ్బడ వెంకటి, ఉపాధ్యక్షులుగా భిరనారాయణ, 
 కోశాధికారిగా పొన్నాల సిద్ధిరాములు, రైటర్ గా శాదల రాజు ఎన్నికయ్యారు. గ్రామంలోని మరొక మున్నూరు కాపు సంఘం కార్యవర్గం సైతం నియామకం జరిగింది. అధ్యక్షులుగా అక్కపెళ్లి నాగరాజు, ఉపాధ్యక్షులుగా కంఠం రాజమల్లయ్య, 
 కోశాధికారిగా పత్యం స్వామి, రైటర్ గా జక్కు శ్రీనివాస్ ఎన్నికయ్యారు.

Post a Comment

Previous Post Next Post