ఘనంగా మాజీ శాసనసభాపతి దుద్దిల్ల శ్రీపాదరావు వర్ధంతి కార్యక్రమం
సిరిసిల్ల, 13 ఏప్రిల్ (జనవిజన్ న్యూస్): ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ సభాపతిగా దివంగత నేత శ్రీపాద రావు చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు టిపిసిసి క్యాంపెయిన్ కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సంగీతం శ్రీనివాస్. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుదిల్ల శ్రీపాదరావు వర్ధంతి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సంగీతం శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా దివంగత నేత శ్రీపాదరావు చిత్రపటానికి స్థానిక నాయకులతో కలిసి పూలమాలతో నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ స్పీకర్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సేవలందించి బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆనాటి ప్రభుత్వంతో వివిధ పథకాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారని సంగీతం శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర ప్రజల మేలు కోరుతూ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న విధాన పరమైన నిర్ణయాలలో ఆయన పాత్ర గొప్పదని అన్నారు. ఆయన హయాంలో మహిళ, శిశు సంక్షేమ కమిటీ ఏర్పాటు చేసిన ఘనత శ్రీపాద రావుదేనని చెప్పారు. శ్రీపాదరావు రాజకీయ జీవితం గ్రామ సర్పంచ్ నుండి మొదలుకొని ఐదుసార్లు మంథని నియోజకవర్గానికి శాసనసభ్యునిగా ఎన్నికై స్పీకర్ గా బాధ్యతలు చేపట్టి తన నియోజకవర్గంలో పాటు రాష్ట్రానికి ఎనలేని సేవలందించారని గుర్తు చేసుకున్నారు. ఆయన తదనంతరం వారి కుమారుడు శ్రీధర్ బాబు ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్ గా, రెండు పర్యాయాలు మంత్రిగా శ్రీపాద రావు యొక్క ఆశయాలను కొనసాగిస్తూ పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వంలో భాగస్వాములమై తాము కూడా కాంగ్రెస్ పార్టీ సైనికులుగా పనిచేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సూర దేవరాజు, పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు చిందం శ్రీనివాస్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధికార ప్రతినిధి రెడ్డిమల్ల భాను, జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శి అకెని సతీష్, పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు శ్రీరామ వెంకటేశం, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వెంగళ అశోక్, ఎస్సీ సెల్ జిల్ల కన్వీనర్ మంగ కిరణ్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రియాజుద్దీన్, తాటికొండ శ్రీనివాస్, దత్తు, సంఘం శ్రీనివాస్, మల్లికార్జున్, వేణు, బాలరాజు, నూనె శ్రీనివాస్, సల్మాన్ తదితరులు పాల్గొన్నారు.