ఘనంగా రాజ్యాంగ నిర్మాత డా. బిఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలు

ఘనంగా రాజ్యాంగ నిర్మాత డా. బిఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలు 

గంభీరావుపేట, 14 ఏప్రిల్ (జనవిజన్ న్యూస్): గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపెట్ గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బిఆర్ అంబేడ్కర్ 134వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామంలోని అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమానికి హాజరై ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రముఖులు మాట్లాడుతూ.. అంబేద్కర్ అంటే క్రియేటర్, టీచర్, ఫైటర్, వారియర్ అని కొనియాడారు. ప్రపంచ వ్యాప్తంగా సింబల్ ఆఫ్ నాలెడ్జ్ గా గుర్తింపు పొందాలని స్పష్టం చేశారు. డా. బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతిని 
ప్రపంచ దేశాలు అన్నీ ప్రపంచ విజ్ఞాన దినోత్సవముగా జరుపుకుంటున్నాయని గుర్తు చేసారు. కార్యక్రమంలొ పోతుల సాగర్, పత్తెం ఆంజనేయులు, అంబేద్కర్ సంఘం సభ్యులు, భూపెల్లి హన్మాండ్లు, జక్కుల నారాయణ, కొండo ఎల్లయ్య, పోతుల జనర్ధన్, జీనుక నర్సయ్య, జక్కుల నవీన్, పోతుల రాజు, మ్యాకల శ్రీనివాస్, పల్లటి రాజు, బైండ్ల నారాయణ, పల్లె బాలరాజ్, కర్రే ఎల్లయ్య, పల్లటి ప్రశాంత్, మినప రాజు 
గ్రామస్తులు గాండ్ల రాజాం, పతెం ఆంజనేయులు, శెట్టి రవి, కాముటం రాజేందర్, కాస దేవరాజ్, రాజమల్లు, బిచ్చల సందీప్ రెడ్డి, సుల్తాని ఎల్లారెడ్డి, జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post