ఎండ భ‌రించ‌లేక‌పోతున్న సింగరేణి ఉద్యోగులు

మంచిర్యాల, 19 ఎప్రిల్: మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం శ్రీరాంపూర్ ఏరియా ఓపెన్ కాస్ట్ గనుల్లో పనిచేసే చోట్ల ఏసీ సౌకర్యంతో రెస్ట్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని మైన్స్ సేఫ్టీ డైరెక్టర్ జనరల్ ఆదేశాలు ఉన్నాయి. అయినా యాజ‌మాన్యం దాన్ని పట్టించుకోవడం లేదు. కొన్ని చోట్ల త‌డ‌క‌ల‌తో పందిళ్లు వేస్తున్నా అవి ఎటూ స‌రిపోవ‌డం లేదని కార్మికులు వాపోతున్నారు. దీంతో కార్మికులు నానా ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తోందని ప‌లువురు కార్మికులు శుక్రవారం ఆందోళ‌న వ్య‌క్తం చేసారు.

Post a Comment

Previous Post Next Post